Friday, November 22, 2024

Cyber Crime: అమాయకులే టార్గెట్‌.. బ్యాంకు పేరిట కాల్‌.. ఓటీపీ తెలుసుకుని లూటీ చేస్తారు..

ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌ : ఈ మధ్యకాలంలో సైబర్‌ నేరాల బెడద ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఏం చేయాలన్నా ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు నయా రూట్లలో ప్రజలను బురిడీ కొట్టించి ఏదో ఒక విధంగా భారీగా డబ్బులు దండుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి..

ప్రస్తుతం భారత్‌ మొత్తం డిజిటల్‌ ఇండియా గా మారి పోతూ ఉంటే డిజిటల్‌ ఇండియా కాస్త.. సైబర్‌ నేరగాళ్లకు ఎంతో ఫేవర్‌గా మారిపోతుంది. ఏదో ఒక రూపంలో సైబర్‌ నేరగాళ్ళు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అయితే సైబర్‌ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణ కుమార్‌ సూచిస్తున్నారు.

పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సైబర్‌ నేరగాళ్ళపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ సైబర్‌ నేరగాళ్ల బెడద మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఇండియా కాస్తా డిజిటల్‌ ఇండియాగా మారిపోతున్న నేపథ్యంలో ప్రతి చోట కూడా క్యూఆర్‌ కోడ్‌ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌ ద్వారానే ఎక్కువ మంది వివిధ రకాల కార్యకలాపాలు చేస్తున్నారు.

అయితే ఈ క్యూఆర్‌ కోడ్‌ విషయంలో కూడాజాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌ చెల్లింపులు, ఇంటర్నెట్‌ వాడకం పెరిగిపోవడంతో సైబర్‌ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేసే ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ విధంగా ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడకుండా పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆన్‌లైన్‌ మోసాలు ఆగడం లేదు..

మోసపోతున్నది విద్యావంతులే..
సైబర్‌ నేరగాళ్ల చేతిలో చదువుకోని వారి కంటే చదువుకున్న వారే ఎక్కువ మోసపోతున్నారు. దీనికి ముఖ్య కారణం సులువుగా డబ్బులు సంపాదించాలనే కోరిక ఒకటయితే, ఆన్‌లైన్‌ మోసాల పట్ల అవగాహన లేకపోవడం మరొక కారణం. సైబర్‌ నేరగాళ్ల చేతిలో పోగొట్టు-కున్న డబ్బులు తిరిగి పొందాలంటే బాధితులు వెంటనే 155260 నెంబర్‌కి లేదా 100కి కాల్‌ చేసి సైబర్‌ నేరానికి సంబందించిన వివరాలను తెలిపితే, నేరస్తుల బ్యాంక్‌ ఎకౌంటును వెంటనే నిలిపివేయడం జరుగుతుందని పోలీసులు సూచిస్తున్నారు.

- Advertisement -

ఆ తరువాత సంబందిత బ్యాంక్‌ ఎకౌంటులో నిలిపివేయబడిన డబ్బులను పోలీస్‌ స్టేషన్‌ ద్వారా బాధితుడు తిరిగి పొందేలా చేయవచ్చు. ఒకవేళ బాధితులు ఆలస్యంగా ఫిర్యాదు చేస్తే, ఆ లోపు నేరస్తుడు సంబందిత బ్యాంక్‌ ఎకౌంటు- నుండి డబ్బులు ఖాళీ చేస్తాడు. ఇలాంటి సమయాలలో డబ్బు తిరిగి పొందడం కష్టం. కాబట్టి సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు వెంటనే

ఫిర్యాదు చేయడం ముఖ్యం.
155260 లేదా 100 నెంబర్‌కి కాల్‌ చేసే సమయంలో ఫిర్యాదిదారుని వద్ద ఉండవలసిన వివరాలు :
డబ్బులు పోగొట్టుకున్న బ్యాంక్‌ పేరు మరియు ఎకౌంటు- నెంబర్‌ 3.ఒకవేల ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి వాలెట్‌లు (లేదా) ప్లిnప్‌ కార్ట్‌ /స్నాప్‌డీల్‌ వంటి సైట్‌ల నుండి డబ్బులు పోగొట్టు-కుంటే ఆ వాలెట్‌/వెబ్‌ సైట్‌ పేరు, ఎకౌంటు-కు సంబందించిన వివరాలు

ఎవరికీ ఆ వివరాలు ఇవ్వవద్దు.
కంప్యూటర్‌ సంబంధించి కంప్యూటర్‌ లేదా లాప్‌టాప్‌ డెస్క్‌పాస్‌వర్డ్‌ వాడాలి. వీలైనంత ఎక్కువగా ఇంటర్‌ నెట్‌ ప్రైవసీ గురించి తెలుసుకోవాలి.అనుమానంగా ఉన్న ఫోన్‌కాల్స్‌, సందేశాలు, మెయిల్స్‌లకు స్పందించరాదు. అనుమానాస్పద ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లకి స్పందించరాదు. వారితో చాట్‌ చేయరాదు. అవసరమైన మెయిల్స్‌ని మాత్రమే ఓపెన్‌ చేయాలి. డెబిట్‌కార్డు, క్రెడిట్‌ కార్డు సమాచారం ఎవరితోనూ షేర్‌చేసుకోరాదు. మీ మొబైల్స్‌కి వచ్చే ఓటీ-పీ సందేశాన్ని ఎవరికి చెప్పరాదు. బ్యాంక్‌కు సం బంధించిన ఏ అధికారి కూడా ఎవరికి ఓటీ-పీ అడగరు. మీ డబ్బుని మీకు తెలియనటు-వంటి ప్రోటో, వీడియో, జాబ్‌ అడ్రస్‌, ఇంటినెంబర్‌కి పంపరాదు. ఫోటోలు సోషల్‌ మీడియాలో ఎక్కువగా షేర్‌ చేయరాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement