హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్‌లో ఇండియా మొత్తంలో 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన ఏడు బృందాలతో గుజరాత్‌తో కీలక ఆపరేషన్ చేశారు. మొత్తం గుజరాత్ రాష్ట్రాన్ని ఈ ఏడు బృందాలు జల్లెడ పట్టాయి. ఈ వేటలో ఇప్పటికే 36 మంది నిందితులు అరెస్టు చేశారు. అందులో ఏడుగురు సైబర్ క్రైమ్ కింగ్ పిన్స్‌తో పాటు ఒక చార్టెడ్ అకౌంట్ కూడా ఉన్నారు. ఇన్‌వెస్ట్‌మెట్ ఫ్రాడ్‌లో 11, ట్రేడింగ్ ఫ్రాడ్‌లో నలుగురు, కేవైసీ ఫ్రాడ్‌లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై హైదరాబాద్‌లో 20 కేసులు ఉన్నట్లు గుర్తించారు.
- Advertisement -