హైదరాబాద్ – తెలంగాణలో డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. డ్రగ్స్ కంట్రోల్ కోసం నార్కోటిక్ బ్యూరో.. దీనికి చీఫ్‌గా సీవీ ఆనంద్‌ను నియమించారు. ఇక పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేశారు. సైబర్ సెక్యూరిటీ వింగ్‌కు చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్రను నియమించారు. కాగా , ఈ రెండు విభాగాలను హోం మంత్రి మహమూద్ అలీ నేడు లాంచనంగా ప్రారంభించారు.. ఐపిఎస్ అధికారులు సివీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్రలు ఆయా విభాగాల అధిపతులుగా బాద్యతలు స్వీకరించారు.. ఈ సందర్భంగా హోమంత్రి వారిని అభినందించారు.. ఈ కార్యక్రమంలో డిజిపి అంజనీకుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు..
నార్కోటిక్ , సైబర్ వింగ్స్ ఏర్పాటు ..బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్, స్టీఫెన్ లు
Advertisement
తాజా వార్తలు
Advertisement