Wednesday, November 20, 2024

జాతీయ ర‌హ‌దారిపై తెగిన క‌ల్వ‌ర్ట్ – జనగామ-సిద్దిపేట జిల్లాల మధ్య రాకపోకలు బంద్

చేర్యాల (ప్రభ న్యూస్​): చేర్యాల మండల వ్యాప్తంగా భారీ వర్షానికి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ భారీ వర్షపాతం కారణంగా వీరన్నపేట స్టేజి వద్ద జాతీయ రహదారి 365 బి పై నిర్మాణంలో ఉన్న కల్వర్టు తెగిపోవడంతో జనగామ-సిద్దిపేట జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా మండలంలోని కడవెరుగు- పోతిరెడ్డిపల్లి, ముత్యాల- మద్దూరు, చేర్యాల-తాడూరు క్రాస్ రోడ్ల మధ్య వాగులు ఉదృతంగా ప్రవహిస్తునడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.

ఆయా ప్రాంతాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చేరిన పట్టణంలోని కొత్త బస్టాండ్ లోకి భారీగా వరదలు చేరడంతో ఆ నీరు బయటకు వెళ్లే కల్వర్టరు పూర్తిగా నిలిచిపోయింది, జాతీయ రహదారిపై నుండి వర్షపు నీరు ప్రవహిస్తుంది. ఇప్పటివరకు కూడా మున్సిపల్ అధికారులు ఇలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మున్సిపల్ అధికారులు తీరుపై పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement