Friday, November 22, 2024

TS : అక్ర‌మంగా విదేశాల నుంచి బంగారం…ప‌ట్టుకున్న క‌స్ట‌మ్స్ అధికారులు

గుట్టుచ‌ప్పుడు కాకుండా విదేశాల నుంచి అక్ర‌మంగా బంగారాన్ని త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. వారి ప్ర‌య‌త్నాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు విఫ‌లం చేశారు. వారు శంషాబాద్‌ విమానాశ్రయంలో ప‌ట్టుబ‌డ్డారు. క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం…..

కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి వివిధ దేశాల నుండి విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చి లగేజీ బ్యాగుతో పాటు ప్రయాణికులను స్కానింగ్ చేశారు. వీరిలో ముగ్గురు వ్యక్తుల వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ప్రయాణికులు బంగారం ముక్కలను శరీర భాగంలో, పురుషనాలంలో, హార్డ్వేర్ టూల్స్‌తో పాటు లగేజీ బ్యాగులలో అక్రమంగా పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని వారివద్ద నుండి రూ.6.03 కోట్ల విలువ చేసే 13.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ప్రయాణికులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement