ప్రభన్యూస్ : కరెంట్ చార్జీలు పెంచేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్ధమైనాయి. గత ఆరేళ్లుగా విద్యుత్ వినియోగదారులపై భారం వేయని నేపథ్యంలో.. ఇప్పుడు భారీగా చార్జీలు పెంచాలనే యోచనలో డిస్కంలు ఉన్నట్లుగా సమాచారం. అయితే ప్రభుత్వం ఏ మేరకు అంగీకరిస్తుందనేది సంశయంగా మారింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పెంచిన కరెంట్ చార్జీలే ఇప్పటి దాక కొనసాగుతున్నాయి. చార్జీల పెంపు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. సీఎం కేసీఆర్ నుంచి చార్జీల పెంపుపై ఆమోదం వచ్చాకనే అవి అమలు అవుతాయని సంబంధిత అధి కారులు చెబుతున్నారు. వేల కోట్ల రూపాయలు అప్పులు, ప్రతి ఏటా ఏర్పడుతున్న ఆదాయ లోటును సరి చేసుకోవాలంటే చార్జీలు పెంపు అని వార్యమని ప్రభుత్వానికి డిస్కమ్‌లు నివేదించుకుం టున్నాయి.
చార్జీల పెంపు ప్రతిపాదన కూడా వారం రోజుల్లో ఇవ్వాలని డిస్కమ్‌లకు ఈఆర్సీ ఐదు రోజుల క్రితం లేఖ రాసింది. ఈఆర్సీ ఇచ్చిన గడువు ఈ నెల 8కి ముగుస్తుంది. ఈఆర్సీ రాసిన లేఖతో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన నివేదికను డిస్కంలు సిద్ధం చేయడంతో పాటు.. ఇచ్చిన గడువులో నివేదించనున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు ఒక్కో కేటగిరికి ఒక్కో రకంగా ఉంటాయి. డోమెెస్టిక్ (గృహా అవసరాలు), కమర్షియల్ (వ్యాపార సముదా యాలు), హెచ్‌టీ (కంపెనీలు)లకు.. ఇలా అన్ని కేటగిరీలకు చార్జీలు పెంచాలని డిస్కమ్‌లు భావిస్తున్నాయి. అయితే ఈ కేటగిరీల్లో ఇండ్లకు ప్రతి యూని ట్‌కు రూ. 50 పైసలు పెంచాలనే ప్రతిపాదన చేసినట్లుగా సమాచారం. అంతకంటే ఎక్కువగా యూ నిట్ల విద్యుత్ వాడుకునే వినియోగ దారులపై యూనిట్‌కు రూ. 1 వరకు పెంచాలనే యోచనలో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital