Friday, November 22, 2024

మోడీని బ్రోకర్ అనాలంటే… సంస్కారం అడ్డొస్తుంది… మంత్రి కేటీఆర్

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిని బ్రోకర్ అని నేను అనలేనా.. సులభంగా అనగలుగుతా.. కానీ సంస్కారం అడ్డు వస్తుందని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. సోమవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ప్రధాని మోడీని తాము కూడా అనగలుగుతామని, అయితే సంస్కారం అడ్డు వచ్చి అనలేకపోతున్నామన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు జీవితంలో ఒక పరీక్ష కూడా రాయలేదు కాబట్టి, చదువుకోలేదు కాబట్టి, పేపర్ లీక్ లకు కేటీఆర్ బాధ్యత అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు.

ఓ నిజామాబాద్ నాయకుడు ఫేక్ డిగ్రీతో దొరికిపోయిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. వినోద్ కుమార్ లాంటి మేధావిని ఓడగొట్టి ఓ సన్నాసిని ఎంపీగా గెలిపించుకొని కరీంనగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పీక్ అవర్ లో కరెంట్ చార్జింగ్ పెంచాలని కేంద్రం ఒత్తిడి తెస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థ ఆయన సింగరేణి బొగ్గు గనులను ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకొని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మూడువేల రూపాయలకు టన్నుకు దొరికే బొగ్గును 30 వేల రూపాయలకు కొనుగోలు చేయడానికి ఒత్తిడి తెస్తున్నారని, తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. అదానీ ఇచ్చే ముడుపుల కోసం విదేశీ బొగ్గు పాలసీ తెచ్చిన ఘనత మోడీకే దక్కిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement