Friday, November 15, 2024

Cultural Feast – శిల్ప క‌లావేదిక‌గా 21 నుంచి లోక్ మంథ‌న్‌

క‌న్నుల‌పండువ‌గా లోక్ మంథ‌న్‌
అతిథ్యం ఇవ్వ‌నున్న హైద‌రాబాద్
21నుంచి శిల్ప క‌లావేదిక‌గా కార్య‌క్ర‌మాలు
భారతీయ సంస్కృతి.. ఏకత్వాన్ని చాటే కేంద్ర ప్ర‌భుత్వ ప్రోగ్రామ్
చీఫ్ గెస్ట్‌గా హాజ‌రుకానున్న రాష్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము
రేవంత్, వెంక‌య్య, మోహ‌న్ భ‌గ‌వ‌త్ హాజ‌రు
దేశ‌, విదేశాల నుంచి ప్ర‌తినిధులు, వ‌క్త‌ల రాక‌
వివ‌రాల‌ను వెల్ల‌డించిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ :
ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం నిర్వ‌హించ‌నున్న‌ట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్ర‌వారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ , ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ , గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. అంతేకాకుండా.. 12 దేశాల ప్రతినిధులు, 100 మంది వక్తలు, 350 రకాల ప్రదర్శనలు, 1500మంది కళాకారులు పాల్గొంటున్నారని కిష‌న్‌రెడ్డి వివ‌రాలు వెల్ల‌డించారు.

రెండేండ్లకోసారి ప్రోగ్రామ్‌..

లోక్ మంథన్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సారి శిల్పకళా వేదికగా హైదరబాద్‌లో నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు కార్యక్రమం ఉంటుంద‌న్నారు. భారతీయ సంస్కృతి ఏకత్వాన్ని చాటే కార్యక్రమం అన్నారు. ఇతర దేశాల నుండి కూడా ప్రతినిధులు పాల్గొన బోతున్నట్లు వెల్లడించారు. వందలాది కళాకారులు, విద్యా వేత్తలు, మేధావులు పాల్గొంటారన్నారు.

- Advertisement -

అంద‌రూ ఆహ్వానితులే..

సముద్ర మథనం ఎలా జరిగిందో అదే మాదిరిగా ఈ లోక్ మంథన్ జరుగుతుందని కిష‌న్‌రెడ్డి వెల్ల‌డించారు. వనవాసి, నగర వాసి, గ్రామ వాసి ఈ మూడు కలిస్తేనే దేశం అన్నారు. దురదృష్టవశాత్తూ కులాల వారీగా విభజించే కుట్ర జరుగుతుందన్నారు. భీర్సా ముండా జయంతినీ గిరిజన గౌరవ దినంగా కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తుందని గుర్తు చేశారు. 21వ తేదీన స్టాల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం వెంకయ్య నాయుడు చేస్తారని తెలిపారు. 22వ తేదీన లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారన్నారు. అన్ని వర్గాల వాళ్ల‌ను కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement