హైదరాబాద్, ప్రభన్యూస్: కొనుగోలు చేసన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కవర్లతోపాటు, గోనె సంచులను రైతులకు అందించాలని సీఎస్ సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశించారు. పార్‌బాయిల్డ్ బియ్యాన్ని కొనేదిలేదని కేంద్రం స్పష్టం చేసిందని, రాష్ట్రంలో కళ్లాల్లో ఉన్న రైతుల ధాన్యానికి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. బీఆర్కే భవన్ నుంచి వరి ధాన్యం కొనుగోళ్లపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లాల పౌరసరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో వరి పంట వేయకుండా చూసుకోవాలని రైతాంగానికి సూచించారు. ప్రస్తుతం నడుస్తున్న కొనుగోలు కేద్రాలను కలెక్టర్లు సందర్శించాలని, కొనుగోళ్లను వేగవంతం చేసి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రం వెలుపలినుంచి వస్తున్న ధాన్యాన్ని నియంత్రించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇది తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారుతుందన్నారు.
ఈ వీడియో కాన్పరెన్స్‌లో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, ఐపీఎస్ జితేందర్, ఇంటలిజెన్స్ అదనపు డీజీ అనిల్‌కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, క్రిస్టినాచోంగ్తూ, కె శ్రీనివాసరాజు, పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్, రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్‌ఎం రావు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital