రాజన్నక్షేత్రం భక్తజనసందోహంతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచే రాజన్నదర్శనం కోసం భక్తులు భారీగా చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ఆదివారమే రాత్రికి భక్తులు క్షేత్రానికి చేరుకొని సోమవారం ఉదయం స్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
వేములవాడ రాజన్నభక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలు అధికారులు రద్దు చేశారు. భక్తులకు లఘు దర్శనానికి అనుమతి ఇచ్చారు. సమ్మక్క-సారలమ్మ జాతర ఇదే నెలలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే..సమ్మక్క-సారలమ్మ జాతరలకు వెళ్లే ముందు… మొదటగా వేములవాడ రాజన్న క్షేత్రానికి రావడం ఆనవాయితీ. వేములవాడ రాజన్న క్షేత్రం వచ్చిన తర్వాతే…సమ్మక్క-సారలమ్మ జాతరలకు వెళతారు జనాలు. ఈ తరుణంలోనే.. జనవరి మాసం నుంచే వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులు విపరీతంగా వస్తున్నారు.