Saturday, January 4, 2025

RR | శంకర్ పల్లి అయ్యప్ప స్వామి టెంపుల్ లో భక్తుల కిటకిట

శంకర్ పల్లి, జనవరి 1 (ఆంధ్రప్రభ) : తెలంగాణ శబరిమలగా భక్తులచే పూజలు అందుకుంటున్న శంకర్ పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఎక్కడ చూసినా భక్తులే ఉదయం ప్రారంభమైన ప్రత్యేక పూజా కార్యక్రమం జనవరి ఒకటి ఆంగ్ల నూతన సంవత్సరం కావడంతో భక్తులు తండోప తండాలుగా విచ్చేసి స్వామివారిని సేవించుకున్నారు. మధ్యాహ్నం ప్రతి బుధవారం నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమంతో ఆలయంలో కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆలయ పరిసరాలన్నీ కూడా భారీగా తరలివచ్చిన జనంతో నిండిపోవడంతో వాహనాలను పటాన్ చెరు ప్రధాన రోడ్డు నుండి అయ్యప్ప గుడి పరిసరాలకు అనుమతించలేదు. దీంతో బీడీఎల్ చౌరస్తా పరి సరాలన్నీ కూడా భారీగా ట్రాఫిక్ తో నిండిపోయినవి.

అంచనాలకు మించి భక్తులు భారీగా తరలిరావడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవైపు ఆలయంలో అయ్యప్ప స్వామి మాలదారుల పూజా కార్యక్రమం, భారీగా చేరుకున్న అయ్యప్ప స్వాముల చేత మహా పడిపూజ కార్యక్రమం, పెద్ద ఎత్తున నిర్వహించారు. అయ్యప్ప స్వాముల మధురమైన గానాలతో ఆలయమంతా దద్దరిల్లిపోయింది.

ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో ఆలయ కమిటీ నుండి దండు మోహన్ గురుస్వామి మాట్లాడుతూ.. మణికంఠుడి ఆశీర్వాదాలతో అందరూ చల్లగా ఉండాలని, ప్రతి సంవత్సరం అంతకంతకు భక్తుల రద్దీ భారీగా పెరిగి ఆలయ విశిష్టతలు ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అనుభూతులుగా మిగలాలని కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లాలని, రాబోయే సంవత్సరం మరింత భారీగా భక్తుల రద్దీతో ఆలయం విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంట వెంటనే ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ వారికి పలువురు భక్తులు అభినందనలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement