Saturday, December 14, 2024

TG | రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

స్వామి వారిని దర్శించుకున్న 50 వేల మంది

ఆలయ ఖజనాకు రూ. 40లక్షల ఆదాయం


వేములవాడ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు- పక్క రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న క్షేత్రానికి తరలివచ్చారు. తెల్లవారు జామున ధర్మ గుండంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు.

- Advertisement -

గర్భ‌గుడిలో కొలువుదీరిన శ్రీ స్వామివారిని దర్శించుకున్న భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ.40 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ వినోద్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement