Tuesday, November 19, 2024

TS : కొండ‌గ‌ట్టు అంజ‌న్న ఆల‌యంలో భ‌క్తుల కిట‌కిట

హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ హనుమాన్ పుణ్యక్షేత్రం కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. శ్రీరామ జయరామ నామ స్మరణతో కొండగట్టు క్షేత్రం మార్మోగింది. మంగళవారం హనుమాన్‌ జయంతి సందర్భంగా కొండంతా కిక్కిరిసిపోయింది.

- Advertisement -

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో కాషాయవర్ణ శోభితమైంది. జయంతి సందర్భంగా ఉదయం నుంచే స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకం, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. దీక్షాప‌రులు స్వామి వారి స‌న్నిధిలో దీక్షా విర‌మ‌ణ చేస్తున్నారు. అర్ధ‌రాత్రి నుంచి సుమారు 50 వేల మంది దీక్షాప‌రులు ద‌ర్శించుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. 22వ తేదీన ప్రారంభ‌మైన ఈ ఉత్స‌వాలు రేప‌టితో ముగియ‌నున్నాయి. బుధ‌వారం కూడా భారీ స్థాయిలో దీక్షాప‌రులు వ‌చ్చి అంజ‌న్న‌ను ద‌ర్శించుకోనున్నారు.

హైద‌రాబాద్ లో వైభ‌వంగా శోభాయాత్ర….
హనుమాన్ జయంతి సందర్భంగా వీర హనుమాన్ శోభాయాత్ర ను నేడు వైభ‌వంగా నిర్వ‌హించారు.. గౌలిగూడలోని రామ మందిరంలో యజ్ఞంతో హనుమాన్‌ పూజలను ప్రారంభించారు. అనంతరం శోభాయాత్ర రామ మందిరం నుంచి మొదలైంది. గౌలిగూడ రామ మందిరం నుంచి పుత్లీబౌలి చౌరస్తా, కోటి ఆంధ్రాబ్యాంక్‌ చౌరస్తా, డీఎంహెచ్‌ఎస్‌ సుల్తాన్‌బజార్‌ క్రాస్‌రోడ్స్‌, రామ్‌కోఠి క్రాస్‌రోడ్‌, కాచికూడ క్రాస్‌రోడ్‌, నారాయణగూడ వైఎంసీఏ మీదుగా చిక్కడపల్లి క్రాస్‌రోడ్స్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, అశోక్‌నగర్‌, గాంధీనగర్‌ బ్యాక్‌సైడ్‌ వైస్రాయ్‌ హోటల్‌, కవాడిగూడ, బన్సీలాల్‌పేట, బైబిల్‌ హౌస్‌, రామ్‌గోపాల్‌పేట, ప్యారడైజ్‌ నుంచి తాడ్‌బండ్‌ హనుమాన్‌ దేవాలయాయం వ‌ర‌కు 13 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగింది. అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు..
ఇక కోఠి ఆంధ్రాబ్యాంక్‌ చౌరస్తా వద్ద సామూహిక హనుమాన్‌ చాలీసా పఠనం, ముఖ్య అతిథులతో బహిరంగ సభ నిర్వహించారు.

భారీ భ‌ద్ర‌త న‌డుమ
మరోవైపు శోభాయాత్రకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీస్‌తో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్‌ను మళ్లించారు. ఎటువంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా శోభ‌యాత్ర ముగియ‌డంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement