Thursday, November 21, 2024

NZB: ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయల టోకరా.. లబోదిబోమంటున్న బాధితులు

నిజామాబాద్ సిటీ, ఆగస్ట్ 2 (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ… అమాయకులైన ఉద్యోగుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని టోకరా వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. మాకు న్యాయం చేయాలంటూ సదరు బాధితులు 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కడియాల రామకృష్ణ అనే వ్యక్తి ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి నుంచి సుమారు లక్ష నుంచి నాలుగు లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని పరారయ్యాడు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వందల సంఖ్యలో వస్తూనే ఉన్నారు.

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, కామారెడ్డి, హైద్రాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి సుమారు 400మంది రామకృష్ణ మాయలో పడ్డారు.. 2017 సంవత్సరంలో రామకృష్ణ విజేత డిఫెన్స్ అకాడమీ ప్రారంభించాడు. సొంత టాలెంట్ ఉద్యోగాలు సంపాదించిన వారి జాబితాను చూయించి నేనే ఉద్యోగాలు ఇప్పించానంటూ బురిడీ కొట్టిస్తాడు.. నకిలీ అపాయింట్మెంట్ పత్రాలను చూయించి నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి వారి నుంచి డబ్బులు కాజేశాడు. రామకృష్ణ పై గతంలో పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఉంది.

ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని గంపెడు ఆశతో కాయాకష్టం చేసి.. అప్పు చేసి తెచ్చి ఇచ్చిన డబ్బులు పాయే .. అని ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాలో నిరుద్యోగులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయ చేసే వారిలో వలలో పడొద్దు. నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు కాజేసిన సదరు రామకృష్ణ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే !

Advertisement

తాజా వార్తలు

Advertisement