Friday, November 22, 2024

కోటి..రూ. 70 లక్షలతో నూతన గ్రంథాలయం.. ప్రారంభించిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ (ప్రభ న్యూస్): గ్రామ గ్రామాన గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశం అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కోటి 70 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఆమె జిల్లా చైర్ ప‌ర్స‌న్ సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్ రెడ్డి, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలను విస్తరించాలని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక గ్రంథాలయానికి బదులుగా మూడు జిల్లాల్లో జిల్లా గ్రంథాల సంస్థలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నూతన గ్రంథాలను ఏర్పాటు చేస్తామ‌ని ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ పిఎసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి జిల్లా గ్రంథాల సంస్థ కార్యదర్శి సురేష్, సిబ్బంది కృష్ణగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ జెడ్పిటిసి ముత్తాహ్ షరీఫ్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement