Tuesday, November 26, 2024

పెద్ద బెల్లాల్ చెరువు వద్ద మొసలి ప్రత్యక్షం – భయాందోళనలో గ్రామాల ప్రజలు

కడెం. సెప్టెంబర్ 6 ప్రభా న్యూస్ నిర్మల్ జిల్లాలోని కడెం మండలం పెద్ద బెల్లాల్ గ్రామ చెరువు వద్ద బుధవారం ఒక మొ సలి ప్రత్యక్షం కావడంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు పై విషయాన్ని గ్రామస్తులు కడెం ఆటవిశాఖ అధికారులు సమాచారం అందించారు దీంతో కడెం ఎఫ్ ఆర్ ఓ సి హెచ్ అనిత తమ సిబ్బందితో పెద్ద బెల్లాల్ చెరువు వద్ద చేరుకొని ప్రత్యక్షమైన మొసలి రిస్క్ ఆపరేషన్ నిర్వహించి చాకచక్యంగా పట్టుకున్నారు

అనంతరం పట్టుకున్న మొసలిని కడెం ప్రాజెక్టు జలాశయంలో వదిలారు ఈ కార్యక్రమంలో పాండవ పూర్ ఎఫ్ బి ఓ రవి బేస్ క్యాంప్ వాచెర్స్ సిబ్బంది జీప్ డ్రైవర్ ఖమరొద్దిన్ సిబ్బంది పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement