Wednesday, January 22, 2025

Crocodile – అయ్యవారిపల్లిలో భారీ మొస‌లి

వ‌నప‌ర్తి, ఆంధ్ర‌ప్ర‌భ : వ‌న‌ప‌ర్తి జిల్లా పెబ్బేరు మండ‌లం అయ్య‌వారిప‌ల్లిలో భారీ మొస‌లిని సాగ‌ర్ స్నేక్ సొసైటీ వ్య‌వ‌స్థాప‌కుడు కృష్ణ సాగ‌ర్ బృంద స‌భ్యులు ప‌ట్టుకున్నారు. బుధ‌వారం ఉద‌యం గ్రామానికి చెందిన బీచుపల్లి కుటుంబ సభ్యురాలు కవిత తమ ఇంటి ఆవరణలో చెట్లపొదల్లో భారీ మొసలిని చూసి భయాందోళనకు గురైంది. గట్టిగా కేకలు వేస్తూ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వెంటనే జిల్లా కేంద్రంలోని సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణ సాగర్ కు సమాచారం ఇచ్చారు.

తాళ్ల‌తోక‌ట్టి బంధించారు
అక్కడికి చేరుకున్న సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణ సాగర్ బృందం బీచుపల్లి ఇంటి దగ్గర ఉన్న‌ 11 ఫీట్ల పొడవు 230 కేజీల బరువు గల భారీ మొసలిని గుర్తించి తాళ్లతో కట్టి బంధించారు. మూడు గంటల నుంచి మొసలి బారిన ఎవరూ పడకుండా గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏఎస్సై వెంకటేశ్వర్ రెడ్డి బందోబస్తు నిర్వహించారు. కృష్ణ సాగర్ మాట్లాడుతూ.. ఎండాకాలం సమీపిస్తున్నందున చెరువుల్లో, కుంటల్లో, కాలువల్లో నీళ్ళు తగ్గడం వల్ల కాలువలకు సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి, ఇళ్లల్లోకి మొసళ్లు చొరబడుతున్నాయన్నారు. ప్రజలందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement