హైదరాబాద్ : ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్ మాట్లాడింది తప్పే అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తాను, రేవంత్ కేవలం కో ఆర్డినేటర్స్ మాత్రమే అని తెలిపారు. రేవంత్ రెడ్డి ఏది చెబితే అది ఫైనల్ అవుతుందా? అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో తాను రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని అన్నారు.. అసలు ఏ సందర్భంగా రేవంత్ మాట్లాడారో తెలుసుకుంటానని హైదరాబాద్ మీడియా సమావేశంలో తెలిపారు కోమటిరెడ్డి..
కాగా, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పలువురు కాంగ్రెరస్ నేతలు తప్పుబట్టారు. రేవంత్ తీరుపై కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి ప్రకటనలు చేసేందుకు రేవంత్ ఎవరని కాంగ్రెస్ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీ.. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే.. మా జాతీయ నాయకత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆ విద్యుత్ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రేవంత్ రెడ్డికి లేదని సీనియర్లు తేల్చిచెప్పారు. రేవంత్ నోరు ఆదుపులో పెట్టుకోవాలంటూ కాంగ్రెస్ నేతలే రేవంత్ కు వార్నింగ్ ఇచ్చారు.