Saturday, November 23, 2024

Banswada : ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధిని ఆప‌లేరు.. స్పీక‌ర్ పోచారం

బాన్సువాడ, ప్రభ న్యూస్ .. ఎన్ని విమర్శలు చేసినా జరుగుతున్న అభివృద్ధిని ఎవరు ఆప‌లేరని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం.. ఆయన తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో నిరుపేదల ప్రజల బతుకుల్లో వెలుగు నింపడమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ప్రణాళికతో కేవలం మూడు సంవత్సరాలలో కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రం వంతుల వారిగా సాగునీరు, తాగునీరు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నిరుపేద వర్గాల ప్రజలకు అవసరమున్న పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్న కేసీఆర్ కే దక్కిందన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దేశంలోని 20 ఉత్తమ గ్రామపంచాయతీలో 19 తెలంగాణ రాష్ట్రానికి చెందినవి కావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. కానీ కొంతమంది పని కట్టుకొని విమర్శలు చేయడం ఓర్వలేక మతిలేక కొంతమంది పిచ్చిపిచ్చిగా మాట్లాడుకుంటున్నారని విమర్శించారు. వారి విమర్శలు పట్టించుకోకుండా అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. కామరెడ్డి జిల్లాలలో గత 9 ఏళ్ల లో సంక్షేమ సంఘం కోసం 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వివరించారు. జిల్లాలో 1,69,000 మందికి పెన్షన్ అందుతున్నాయని అన్నారు. డబల్ బెడ్ రూమ్ పథకం ఖర్చు,శ్రమతో కూడుకున్నప్పటికీ అవసరమైన పేదలకు మందు చేయడానికి కృషి చేశామని అన్నారు. దేశంలో అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని వివరించారు. నూరు శాతం సబ్సిడీతో చేప విత్తనాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జడ్పీ చైర్మన్ దఫెదార్ శోభ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రీ, జిల్లా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement