Friday, November 22, 2024

TS | ఓర్వలేకనే రాష్ట్ర సర్కార్ పై విపక్షాల విమర్శలు.. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్

క్రిస్టియన్ల అభివృద్ధి సీఎం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి ఓర్వలేకనే విపక్షాలు తెలంగాణ సర్కార్ మీద దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రిస్టియన్ సమాజం బీఆర్ఎస్ పార్టీకి దగ్గరవుతున్నారనే గోబెల్స్‌ ప్రచారానికి తెరలేపాయని అన్నారు. క్రిస్టియన్ల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. క్రిస్టియన్ల అభ్యున్నతికి ఎన్నో పథకాలను తీసుకువచ్చినట్లు వివరించారు. గత ప్రభుత్వాలు క్రిస్మస్ వేడుకలను కేవలం 40 లేదా 50 మంది క్రిస్టియన్ నాయకులు, మతపెద్దలను పిలిచి తేనేటి విందు ఇచ్చి మమ‌ అనిపించుకునేవారని గుర్తుచేశారు.

కానీ మన తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏటా ఎల్బీ స్టేడియంలో దాదాపు 15 వేల మందితో అధికారికంగా వేడుకలు జరపడమే కాకుండా వారితో కలిసి క్రిస్మస్ ప్రేమ విందులో పాల్గొంటున్నార‌ని తెలిపారు. ఏటా దాదాపు 2.85 లక్షల కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు, క్రిస్మస్ వేడుకల కోసం నియోజకవర్గానికి రూ. 2 లక్షల నిధులు కేటాయించిదన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 411 చర్చిలకు గాను రూ. 32.63 కోట్లు కేటాయించారని తెలిపారు.

విదేశాల్లో ఉన్నత చదువులు చదువాలనుకునే విద్యార్ధులకు రూ. 20లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు అందజేస్తూ వారి ఉజ్వ భవిష్యత్ కు బాటలు వేస్తున్నారన్నారు. అలాగే 2 వేల మంది క్రిస్టియన్ మహిళలకు ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచితంగా కుట్టు మిషన్ యంత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే క్రైస్తవులకు 100 శాతం సబ్సిడీతో రూ. ఒక లక్ష ఆర్ధిక సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ కార్పోరేషన్ ఈనెల 31 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. http://tsobmmssbc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని వివరించారు. మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ కార్పోరేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

రాష్ట్రం నడిబొడ్డున హైదరాబాద్ లో క్రిస్టియన్లకు ఆత్మగౌరవ భవనం ఉండాలని తలంచిన కేసీఆర్ ఉప్పల్ భగాయత్ లో 2 ఎకరాలు స్థలం కేటాయించారని. అంతేకాకుండా ఈ స్థలంలో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం తొలుత రూ. 10 కోట్లు కేటాయించిందని వివరించారు. క్రిస్టియన్ల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్నిచేస్తున్న విపక్షాలకు కనిపించడంలూదని ఎద్దేవా చేశారు. వీటిని చూసి ఓర్వలేకే విపక్షాలు కావాలనే క్రిస్టియన్లకు చయడం లేదని ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వారు ఎన్ని కుట్రలు చేసిన కేసీఆర్ చేస్తున్న సేవలు గుర్తుంచుకుని క్రిస్టియన్ సమాజం బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement