Monday, November 11, 2024

Criminal Cases – అధికారుల‌పై హైడ్రా పంజా … ఆరుగురు అధికారుల‌పై కేసు న‌మోదు…

హైదరాబాద్: హైడ్రా బుల్డోజర్ చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారి పైకి మళ్లిన విషయం తెలిసిందే. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసి మరీ 50 మందికి పైగా అధికారులను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మొత్తానికి అధికారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా సైబరాబాద్ ఈవోడబ్ల్యూ వింగ్ అధికారులు ఆరుగురు అధికారులపై కేసులు నమోదు చేశారు. వారిలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు చెందిన అధికారులు ఉన్నారు. ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

హైడ్రా సిఫారసుల మేరకు..

చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధామ్స్.. బాచుపల్లి ఎంఆర్ఓ‌పై కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే మేడ్చల్ మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్ హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజకుమార్ పై కేసు నమోదైంది. హైడ్రా సిఫారసుల మేరకు ఆయా అధికారులపై కేసులు నమోదు చేయడం జరిగింది. హైదరాబాదులో చెరువుల్లో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో కేసులను సీపీ అవినాష్ మహంతి నమోదు చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

కేసులు నమోదైన అధికారుల జాబితా

నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ
చందానగర్ GHMC డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్‌,
బాచుపల్లి MRO పూల్‌ సింగ్
మేడ్చల్-మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్‌ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు
HMDA అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్‌కుమార్
HMDA సిటీ ప్లానర్‌ రాజ్‌కుమార్‌ల

Advertisement

తాజా వార్తలు

Advertisement