Friday, October 18, 2024

Crime : ఆటోలోనే లైంగిక దాడి …

హైదరాబాద్‌లో తాజాగా మరో దారుణం వెలుగు చూసింది.. ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు..

గచ్చిబౌలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అర్ధరాత్రి సమయంలో ఆటో వెళ్తున్న యువతిపై కన్నేసిన కామాంధులు.. ఆటోలోనే ఆమెపై అత్యాచారాకి ఒడిగట్టారు.. ఆటో డ్రైవర్‌తో పాటు.. మరో యువకుడు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు..

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న అర్ధరాత్రి ఆర్‌సీ పురం వద్ద ఆటో ఎక్కింది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న యువతి.. ఆ ఆటో అర్ధరాత్రి 2:30 సమయంలో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది.. అయితే, మసీద్‌ బండ దగ్గరకు ఆటో చేరుకోగానే.. తనపై ఆటో డ్రైవర్‌తో పాటు మరో యువకుడు.. ఆటోలోనే అత్యాచారం చేశారని గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు..

- Advertisement -

తనపై అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం మసీద్ బండ దగ్గర వదిలి పారిపోయారని ఫిర్యాదులో తెలిపింది యువతి.. ఇక, కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement