Friday, November 22, 2024

Crime – 15 కత్తి పోట్లు – 15 ముక్కలు

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన ఎర్రం అనురాధరెడ్డి(55) దారుణ హత్యోదంతం కేసులో మరికొన్ని కోణాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు బి.చంద్రమోహన్‌ అరెస్టు, రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొంటున్న పలు కీలక అంశాలు తెలిశాయి. అనురాధతో 15 ఏళ్లు సాగిన సహజీవనానికి గుర్తుగా నిందితుడు 15 కత్తిపోట్లు పొడిచి హత్య చేశాడని సమాచారం. కొన్నాళ్లుగా ఇరువురి మధ్య విభేదాలు తలెత్తడంతోనే మరో పెళ్లికి సిద్ధపడిన అనురాధ తమిళ మాట్రిమోనీలో ప్రకటనలు ఇచ్చింది. పెళ్లి చేసుకోబోతున్న తనకు రూ.17 లక్షల నగదు, 2 కిలోలకుపైగా బంగారం తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేసినట్లు తెలిసింది.

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నిందితుడు, అనురాధ అడ్డు తొలగితే నగదు, నగలు ఇవ్వాల్సిన అవసరముండదని భావించి హత్యకు పథకం రూపొందించాడు. ఈ నెల 12న గొడవపడి కత్తితో 15సార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఒకరోజు మృతదేహాన్ని అలాగే బయటే ఉంచిన నిందితుడు, పక్కనే అద్దెకుండేవారు ఊరికెళ్లాక స్టోన్‌ కట్టర్లు తెచ్చి ముక్కలు చేశాడు. ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాక్‌ చేసి ఫ్రిజ్‌లో ఉంచాడు. 15న తలను మూసీ నది పరివాహక ప్రాంతం తీగలగూడ రహదారికి పక్కన ఖాళీ స్థలంలో పడేశాడు. అంతర్జాలంలో చూసి మృతదేహాన్ని ఆరు ముక్కలు చేశాడని రిమాండ్‌ నివేదికలో పోలీసులు వివరించారు. చెడు వాసన వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్న నిందితుడు అందుకు కొన్ని రసాయనాలు వాడానని విచారణలో అంగీకరించాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement