Friday, November 22, 2024

Crime News – కానిస్టేబుల్​ కీచకత్వం! సస్పెండ్​ చేసిన పోలీసు కమిషనర్​

(ప్రభ న్యూస్, నిజామాబాద్) – హత్య కేసులో బెయిల్‌పై వచ్చి తప్పించుకు తిరుగుతున్న నిందితుడి కోసం నాన్ బెయిలబుల్ వారెంటుతో వెళ్లిన కానిస్టేబుల్.. ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆ కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు. అతడికి సహకరించిన ఎస్.ఐ, హెడ్ కానిస్టేబుల్‌కు అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన అత్తను హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చాడు. కోర్టు వాయిదాలకు హాజరు కావటం లేదు. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేయగా.. వారెంటును అప్పగించేందుకు కానిస్టేబుల్ మహేష్ గుండారం గ్రామానికి వెళ్లాడు. కానీ, ఆ నిందితుడు అప్పటికే తన ఇంటిని వేరే వారికి అమ్మేసి పరారయ్యాడు.

బాలిక‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌..
కాగా, వారెంట్ ఇవ్వ‌డానికి వెళ్లిన ఆ ఇంటిని మహారాష్ట్రకు చెందిన కుటుంబం కొనుక్కుంది. కానిస్టేబుల్ వెళ్లే సమయానికి ఆ ఇంట్లో ఓ మైనర్ బాలిక మాత్రమే ఉంది. అదే అదునుగా భావించిన అతను ఆ బాలికను మాయమాటలతో లోబర్చు కునే యత్నం చేశాడు. డబ్బు ఆశ చూపి అసభ్యంగా ప్రర్తించా డు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి, తన ఫోన్ నంబర్ ఇచ్చి ఫోన్ చేయాలని వెళ్ళిపోయాడు. పని నిమిత్తం బయటకు వెళ్లిన బాలిక తల్లదండ్రులు ఇంటికి రాగా.. ఆ బాలిక తన తండ్రితో ఈ విషయాన్ని రోదిస్తూ చెప్పింది. బాలిక తండ్రి నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు కానిస్టేబుల్ మ‌హేశ్‌పై ఫో క్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

కేసు విష‌యం తెలిసి ప‌రారు..
కేసు విషయం తెలిసిన కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. ఎస్ ఐ, హెడ్ కానీస్టేబుల్ కు ఉన్నతాధికారులు షో కాజ్ నోటీస్ లు జారీ చేశారు. గతంలోనూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను మహేష్ లోబర్చుకొని దంపతుల మధ్య గొడవకు కారణమ‌య్యాడ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. దీనిపై ఆంధ్రప్రభ దినపత్రికలో ‘‘కానిస్టేబుల్ కాదు.. కామ పిశాచి’’ అనే కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించి.. విచారణ జరిపిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ అప్పట్లో అతడిని సస్పెండ్ చేశారు. కాగా ఈ మధ్యనే ఆ కానిస్టేబుల్​ తిరిగి విధుల్లో చేరి మరోసారి అలాంటి అఘాయిత్యానికే పాల్పడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement