- మొత్తం కేసుల సంఖ్య 33,084
- డ్రగ్స్,సైబర్ నేరాలు పెరుగుతున్నాయి
- రూ.88.25కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- రాచకొండ పరిధిలో నేరాల చిట్టా విప్పిన సీపీ సుధీర్ బాబు
ఈ ఏడాది మొత్తం 33,084 కేసులు నమోదయ్యాయని.. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మొత్తం 4% క్రైమ్ పెరిగిందన్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. మహిళలపై నేరాలు 9% పెరిగాయన్నారు. 25,143 కేసులు క్లోజ్ చేసామని.. వివిధ కేసుల్లో 30మందికి జీవిత ఖైదీ పడేలా చేశామని తెలిపారు. ఇది దేశంలో మొదటిసారన్నారు. మోట కొండూరు హత్య కేసులో 14మందికి శిక్ష వేయించామన్నారు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో జరిగిన నేరాలు, కేసుల వివరాలకు సంబంధించి వార్షిక నేర నివేదిక 2024ను సిపి సుధీర్ బాబు నేడు మీడియాకు వెల్లడించారు.
రూ.88.25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం…
ఈ ఏడాది 88.25 కోట్ల డ్రగ్స్‌ను సిజ్ చేశామన్నారు. ఏడాది మొత్తం 521 డ్రగ్స్ నేరస్తులను అరెస్టు చేశామని అందులో తెలంగాణలో 319, అంతరాష్ట్రానికి చెందిన 202 డ్రగ్స్ నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. డ్రగ్స్ నిందితులపై 165 హిస్టరీ షీట్స్‌ను ఓపెన్ చేశామన్నారు. 11,440 ఎఫ్‌ఐఆర్ కేసులు, 70,791 పిట్టి కేసులను లోకదాలత్ ద్వారా క్లోజ్ చేశామని చెప్పారు. డయల్ 100కు 2,41,742 కాల్స్ వచ్చాయన్నారు. అలాగే ఈ ఏడాది జరిగినటువంటి ఎలక్షన్స్‌లో 16 కోట్ల నగదును, మద్యాన్ని సిజ్ చేశామన్నారు. 17 పేకాట స్థావరాలు, 5 వ్యభిచారం స్థావరాలు, ఒకటి బార్ క్లోజ్ చేశామని వెల్లడించారు. 22 కోట్ల రూపాయలను సైబర్ బాధితులకు రిఫండ్ చేశామని తెలిపారు. గేమింగ్ యాక్ట్ కింద 236 కేసులు, 1486 మంది అరెస్ట్ చేసి 1 కోటి రూపాయల సొమ్మును సీజ్ చేశామన్నారు. సైబర్ క్రైమ్ ఎక్కువగా పెరుగుతున్నాయని.. డిజిటల్ అరెస్ట్, ఏఐ ద్వారా మోసాలు చేస్తున్నారన్నారు. సైబర్ క్రైమ్ కేసులు 42.05% శాతం పెరిగినట్లు సీపీ చెప్పుకొచ్చారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసులు..
2023లో 2562 కేసులు నమోదు అవగా.. 2024 లో 4458 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు కంట్రోల్ చేసేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.23.12 కోట్ల డబ్బును బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేశామన్నారు. రూ.21.94 కోట్లు సైబర్ క్రైమ్ బాధితులకు అందజేశామని చెప్పారు. సైబర్ నేరాల్లో 53 మంది విదేశీయులను అరెస్ట్ చేశామన్నారు. 2125 పార్ట్ టైం, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు ఎక్కువయ్యాయన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 15,692 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయన్నారు. 102 మందికి జైలు శిక్ష పడగా.. 3 కోట్ల 42 లక్షల మందికి కోర్టు ఫైన్ విధించిందన్నారు.