ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసులు దృష్టి సారించారు. నగరంలోని వనస్థలిపురంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యుల నుంచి రూ.15 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ప్రైవేట్ సంస్థల పేరుతో ఆయా బ్యాంకుల్లో ఖాతాలను తెరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎనిమిది బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement