Tuesday, October 29, 2024

Crackers Shops – అగ్గి రగిలితే బుగ్గే – జనవాసాల మధ్యలో పటాసుల దుకాణాలు

నిజామాబాద్ ప్రతినిధి అక్టోబర్27: (ఆంధ్రప్రభ)దీపావళి పండుగ వచ్చేసింది ఇప్పటినుంచే చిన్నారుల ఉత్సాహం మొదలైంది టపా సులు కొనాలి పేల్చాలే అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో నిజా మాబాద్ లో విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ అను మతులు లేకుండానే టపా సుల విక్రయాలు జోరుగా చేపడుతున్నారు

. *రద్దీగా ఉండే గంజి ప్రాంతంలో టపాసుల దుకాణాలు*

వడ్డించేటోడు మనోడు అయితే ఏ వరుసలో కూర్చు న్న ఏమిటి అన్న చందంగా ఉంది బాణాసంచా వ్యాపా రుల పరిస్థితి. జనావాసాల మధ్య నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో టపాసుల దుకా ణాలు ఏర్పాటు చేసి టన్నుల కొద్ది దిగుమతి చేసుకుంటు న్నారు. పేలుడు పదార్థాలతో తయారుచేసిన టపాసులు ఊరి బయట విక్రయించాల్సి ఉండగా వ్యాపారులు నిబం ధనలకు విరుద్ధంగా పట్టణం నడిబొ డ్డున దుకాణాలు ఏర్పాటు చేసి టపాసులను అమ్ముతు న్నారు.

కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని నిత్యం రద్దీగా ఉండే ప్రాం తాల్లో ఈ టపాసుల దుకా ణాలకు అనుమతులు ఎలా వచ్చాయి. తక్కువ కాలు ష్యం వెదజల్లే టపాసులు కాల్చాలన్న నిబంధనలు కూడా తుంగలో తొక్కుతు న్నారు

- Advertisement -

సంబంధిత శాఖల అధికారులు మామూలు గా తీసుకుం టున్నడంతో ఈ అక్రమ దందా సాఫీగా సాగిపో తుంది. జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానిక దుకాణాదారులు ప్రజ లు భయాందోళనకు గురవు తున్నారు.

నిత్యం రద్దీగా ఉండే ఈ గంజి ప్రాంతంలో టపాసుల దుకాణాల విక్ర యాలకు అనుమతులు ఉన్నాయా? ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే పెద్ద ఆస్తి నష్టం ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు హడావుడి చేయడం పరిపాటి.

టన్నులకొద్దీ టపాసులను దిగుమతి చేసుకొని విచ్చలవిడిగా టపా సుల విక్రయాలు జరుపు తున్న సంబంధిత అధికారు లు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

*పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అనుమతులు రాకుండానే టపాసుల విక్రయాలు*

నిజామాబాదులో టపాసుల విక్రయాలకు సంబంధించి సుమారు 60 వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో 48 దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.గత సంవత్సరం పాత కలెక్టరేట్ మైదా నంలో42 టపాసుల దుకా ణాలు విక్రయాలు జరిపారు.

కానీ అనుమతులు రాకముందే పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో దుకా ణాలను ఏర్పాటు చేసుకొని జోరుగా విక్రయాలు జరుపు తున్న సంబంధిత అధికా రులు పట్టించుకోకపోవడం వెనుక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టపాసుల దుకాణాల నిర్వాహకులు అన్ని నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

దుకాణాల నిర్వా హకులు భద్రతా విషయంలో రాజీ పడితే కఠిన చర్యలు తప్ప వని పోలీస్ శాఖ హెచ్చ రిస్తుంది. వేలాదిమంది టపా సుల దుకాణాల వద్దకు వచ్చే అవకాశం ఉన్నందున అదే స్థాయిలో వ్యాపారులు ఏర్పా టు చేసుకోవాలని సూచిస్తు న్నారు.

పోలీస్, రెవెన్యూ, విద్యుత్ , కార్పొరేషన్ శాఖ, ఫైర్ స్టేషన్లలో కూడా అనుమ తులు తీసుకోవాలని సూచి స్తున్నారు. బాణాసంచా దుకాణాల్లో ఫైర్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది టపాసుల దుకాణాల ఏర్పాటుపై పోలీస్ శాఖ కఠిన తర నిబంధ నలను సూచిస్తూ అవగా హన సదస్సులు నిర్వహించిన టపాసుల నిర్వాహకుల్లో తీరు మారలేదు. ఇప్పటికైనా రద్దీగా ఉండే ప్రాంతాల్లో విచ్చలవిడిగా టపాసుల విక్రయాలు జరు పుతున్న దుకాణాలపై చర్యలు తీసుకొని ప్రమాదం జరగక ముందే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజామాబాద్ నగరంలో పలుచోట్ల టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకొని విక్రయాలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement