Tuesday, December 3, 2024

KNR | అక్రమ వడ్డీ, ఫైనాన్స్‌ వ్యాపారులపై ఉక్కుపాదం

సిరిసిల్ల, (ఆంధ్రప్రభ) : జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్‌ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 టీమ్‌లుగా ఏర్పడి ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఆరుగురుని అదుపులోకి తీసుకోగా, వారి వద్ద సుమారు రూ. 80లక్షల విలువ గల 216 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్‌ మహజన్‌ తెలిపారు.

జిల్లాలో అనుమతులు లేకుండా ఫైనాన్స్‌ నిర్వహించిన, అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుండి అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవన్నారు.

ప్రజలు తమకున్న ఉన్న అత్యవసర పరిస్థితి, తాత్కాలిక అవసరాల కోసం అధిక మొత్తంలో అవసరానికి మించి అధిక వడ్డీలకు అప్పు చేసి ఆతరువాత అప్పులు, అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడి తమ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దని ఎస్పీ కోరారు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్‌ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలని, ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకపోయినా అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో తనకు సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.

అలాగే స్థానిక పోలీసు వారికి, డయల్‌100 కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ కొరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతోపాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్‌ శాఖ పని చేస్తుందన్నారు. చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యులపై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement