Friday, November 22, 2024

TS : సీపీఎం పార్టీ తొలి జాబితా విడుదల

హైద‌రాబాద్ – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీపీఎం ఆదివారం విడుదల చేసింది. సీపీఎం తొలి జాబితాలో 14 మందికి చోటు దక్కింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లలోకి వెళ్లాలని పార్టీ సమావేశంలో నిర్ణయించినట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు. మిగిలిన మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను త్వరలో విడుదల చేస్తామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. అసెంబ్లీలో సీపీఎం ప్రాతినిధ్యం కల్పించండి.. తమ పార్టీకి ప్రాతినిధ్యం కల్పిస్తేనే పేద ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తమ్మినేని వీరభద్రం అన్నారు.

చట్టసభల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేశారని తమ్మినేని వీరభద్రం గుర్తు చేశారు. ఈ విషయాలను తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. సీపీఎంతో పాటు వామపక్ష శక్తులను బలోపేతం చేయాలని తమ్మినేని వీరభరం ప్రజలను కోరారు. సీపీఎం బలపరిచిన శక్తులకు సంఘీభావం తెలపాలన్నారు. బీజేపీని నెట్టివేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. బీజేపీ గెలిచే స్థానాల్లో బీజేపీని ఏ పార్టీ ఓడించినా తమ పార్టీ మద్దతు ఉంటుందని తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. 17 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పారు.

ఇదీ సీపీఎం అభ్యర్థుల జాబితా..

  1. పటాన్చెరు- మల్లికార్జున్
    2.ముషీరాబాద్-దశరథ్
  2. భద్రాచలం- కారం పుల్లయ్య
  3. అశ్వారావుపేట-పి. అర్జున్
  4. పాలేరు-తమ్మినేని వీరభద్రం
  5. మధిర-పాలడుగు భాస్కర్
  6. వైర-భుక్య వీరభద్రం
  7. ఖమ్మం-శ్రీకాంత్
  8. సత్తుపల్లి-భారతీయుడు
  9. మిర్యాలగూడ-జూలకంటి రంగారెడ్డి
    11.నకిరేకల్-చినవెంకులు
  10. భువనగిరి-నర్సింహ
  11. జనగామ-కనకారెడ్డి
  12. ఇబ్రహీంపట్నం-పగడాల యాదయ్య
Advertisement

తాజా వార్తలు

Advertisement