Tuesday, November 19, 2024

Support – చేతులు కలిపిన కామ్రేడ్స్​! సీఎం రేవంత్​తో సీపీఎం నేతల భేటీ

హైదరాబాద్ – లోక్​స‌భ ఎన్నిక‌ల్లో భువనగిరితో పాటు ఇతర స్థానాల్లో మద్దతు ఇవ్వాలని సీపీఎం నేత‌ల‌ను పీసీసీ చీఫ్​, సీఎం రేవంత్ కోరారు. ముఖ్యమంత్రి నివాసంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు శనివారం భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం రేవంత్ మాట్లాడుతూ సీపీఎం నేతలతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించామన్నారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు తమ ఎదుట కొన్ని ప్రతిపాదనలు పెట్టారని వెల్లడించారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామన్నారు. దేశంలోనూ ఇండియా కూటమితో ఆ పార్టీ కలిసి పని చేయనుంద‌న్నారు.. తెలంగాణ‌లో మాత్రం ఒకట్రెండు విషయాల్లో సీపీఎంతో సందిగ్ధత ఉంద‌ని, దీన్ని త్వ‌ర‌లో ప‌రిష్క‌రించుకుంటామ‌ని చెప్పారు. సీపీఎం సహకారంతో భవిష్యత్​లో ముందుకెళ్తాన్న సీఎం.. ఈ కలయిక కాంగ్రెస్ గెలుపునకు పని చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

కాగా, సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. లోక్​సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను విరమించుకోవాలని సీఎం కోరినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీజేపీ శక్తులను అడ్డుకునేందుకు కాంగ్రెస్​కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement