Tuesday, January 7, 2025

CPM – రాజ‌కీయ స్వార్థం కోస‌మే జమిలి ఎన్నిక‌లు – బీవీ రాఘ‌వులు

సంగారెడ్డి ఆంధ్ర‌ప్ర‌భ : రాజకీయ స్వార్థం కోసమే జమిలి ఎన్నికల నినాదం బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. శుక్ర‌వారం సంగారెడ్డి సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రయోజనం కోసమే ఒకే దేశం, ఒకే ఎన్నికని బీజేపీ కుట్రలు పన్నుతోంద‌ని విమ‌ర్శించారు. పార్లమెంట్‌లో జమిలి బిల్లు పాస్ కాదని విషయం తెలిసినా హైలెట్ కావడం కోసమే బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంద‌ని మండిపడ్డారు.

కస్తూర్బా ఉద్యోగులను చర్చలకు పిల‌వాలి
రాష్ట్రంలో మంత్రులు కస్తూర్బా ఉద్యోగుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని బీవీ రాఘ‌వులు ఆరోపించారు. క‌స్తూర్బా ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వారికి చ‌ర్చ‌లు పిల‌వ‌న్నారు. పంజాబ్‌లో గత 39 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నార‌ని, దలేవాల్ అనే రైతు నాయకుడు హాస్పిటల్‌లో నిరాహార దీక్ష చేస్తున్నార‌ని, అయినా కేంద్ర ప్రభుత్వం రైతుల ఆందోళనలపై స్పందించకపోవడం దారుణమని అన్నారు. కస్తూర్బా గాంధీ ఉద్యోగులు గత 25 రోజులుగా ఆందోళన చేస్తున్నార‌ని అన్నారు. ప్రభుత్వం వెంటనే వారి డిమాండ్‌లపై దృష్టి సారించి, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement