Friday, November 22, 2024

పాలేరు,మిర్యాల‌గూడ‌,కొత్త‌గూడెంల‌పై కామ్రేడ్ల క‌న్ను…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో శాసన సభలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో ఉన్న వామపక్షాలు భారత కమ్యూ నిస్ట్‌ పార్టీ(సీపీఐ), భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌) ఆ దిశలోనే అడు గులు వేగంగా కదుపుతున్నాయి. తమకు పట్టు, బలం ఉన్న 20 నియో జకవర్గాలను గుర్తించి వాటిల్లో పోటీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతున్నాయి. బీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ తో పొత్తులు కుదిరితే సరి, లేకపోతే సంయుక్తంగానే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఒకవేళ పొత్తులు ఉంటే ముఖ్యంగా మూడు స్థానాలను తమకు వదులుకునే పార్టీలతోనే ఎన్నికల్లో కలిసి వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. పొత్తులంటూ కుదిరితే 10 స్థానాల్లో పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగూడెం, పాలేరు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని ఇటీవల జరిగిన సీపీఐ, సీపీఎం సంయుక్త సమావేశంలో నిర్ణయించాయి. కొత్తగూడెం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సొంత నియోజకవర్గం. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే కొత్తగూడెం నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నారు. పార్టీ కూడా ఆయనకు కొత్తగూడెం నుంచే పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం.

అదే విధంగా పాలేరు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.ఈ నియోజకవర్గంలో 20 వేలకుపైగా వామపక్షాల ఓట్‌ బ్యాంక్‌ ఉన్నట్లు గుర్తించారు. అంతేగాక ఈ నియోజకవర్గం పరిధిలోఆయన సొంత గ్రామం ఉండడంతో ఆయన అక్కడి నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇక మిర్యాలగూడ విషయానికి వస్తే సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మూడుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మళ్లిd మిర్యాలగూడ నుంచే పోటీ చేసేందుకు సిద్ధమై ప్రచారాన్ని కూడా చేపట్టారు. తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తుందని తమ్మినేని వీరభద్రం మిర్యాలగూడలో జరిగిన బస్సు యాత్రలో ప్రకటించి జూలకంటి రంగారెడ్డి పోటీని అధికారికంగా ధృవీకరించి సంచలనం సృష్టించారు. బీజేపీని ఓడించే పార్టీలతోనే వచ్చే ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకుంటా మని ఇప్పటికే సీపీఐ, సీపీఎం ఇప్పటికే ప్రకటించాయి. బీఆర్‌ఎస్‌తోనే పొత్తు ఉంటుందని అనధికారికంగా ఈ పార్టీల నేతలు పార్టీ శ్రేణులతో చెబుతున్నట్లు సమాచారం.

అయితే, ఈ మూడు నియోజకవర్గాలను వదులుకునేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధపడతారా ?అనేది ఆసక్తికరంగా మారింది. వామపక్షాల బలం ఎంతో మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు తెలిసిపోయిందని, కాబట్టి తమ డిమాండ్లను బీఆర్‌ఎస్‌ సారథి కేసీఆర్‌ ఒప్పుకుంటారనే వామపక్షాల నేతలు ఆశాభావంతో ఉన్నారు. దాదాపు 20 కి పైగా నియో జకవర్గాల్లో 20 వేలకు పైగా ఓట్లు ఉన్న నియోజకవర్గాలు తమ గుప్పిట్లో ఉన్నాయని, అంతేగాక ప్రతి నియోజకవర్గంలో 5 వేలకు తక్కువగా కుండా తమ ఓట్‌ బ్యాంక్‌ ఉందని వామపక్షాల ధీమా. మూడో సారి హ్యాట్రిక్‌ విజయం సాధించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌కు తమ మద్దతు తప్పనిసరి అవసరమవుతుందని లేకపోతే బీఆర్‌ఎస్‌ ఇబ్బందు ల్లో పడుతుందని కేసీఆర్‌కు కూడా తెలుసునని వామపక్ష నేత ఒకరు చెప్పారు. టీడీపీ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతు న్నందున అంతిమంగా నష్టపోయేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని వారి అంచ నా. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా మార్చి కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు సవాళ్లు విసురుతున్న కేసీఆర్‌ తమ పొత్తుల డిమాండ్‌పై సాను కూలంగా ఉంటారని వామపక్ష నేతలు ఆశాభావంతో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement