హైదరాబాద్ – తెలంగాణాలో సీపీఐ ఓట్లు కలవడం వల్లే కాంగ్రెస్ విజయం సాధించిందని అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ… ..సిపిఐ పొత్తు వల్ల తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని వెల్లడించారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని చురకలు అంటించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని అన్నారు. రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల వల్లే ఓడి పోయిందని నిప్పులు వ్యాఖ్యానించారు. తెలంగాణలో అందరినీ కలుపుకుపోయింది కాబట్టి కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు
వచ్చే ఎన్నికలలో కేరళలో 4, తమిళనాడు 2, బెంగాల్ 3, బస్తర్ లోని ఎంపీ సీట్లలో పోటీ చేస్తామన్నారు. తెలంగాణలో ఒక ఎంపీ, ఏపిలో ఒక ఎంపీ సీట్లో పోటీ చేస్తామని తేల్చి చెప్పారు నారాయణ ..
పాస్ బుక్ లపై ఫోటోతో బతికి ఉండగానే జగన్ సమాధి…
ఎపిలో రైతుల పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ముద్రించడాన్ని తప్పుపట్టారు.. ఇలా చేయడం బతికి వుండగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టుకుంటున్నారని వివరించారు. పాస్ బుక్ లో జగన్ ఫోటోలు ఎందుకు, శాశ్వత ముఖ్యమంత్రి కాదు కదా అని ప్రశ్నించారు.