పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే CPGET నోటిఫికేషన్ విడుదలయింది. కాసేపటిక్రితమే CPGET నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ తెలిపింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రవేశ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తామని వెల్లడించింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ పరీక్ష ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఉస్మానియా యూనివర్సిటీతోపాటు, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహణ, జేఎన్‌టీయూ వర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సులు వివరాలు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎకామ్, ఎంసీజే, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ తదితర కోర్సులు
పీజీ డిప్లొమా కోర్సులు
ఏంఏ, ఎమ్మె్స్సీ, ఎంబీఏలో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ప్రాగ్రామ్స్
అర్హతలు: పీజీ కోర్సులకు.. సంబంధింత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: జూలై 30
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 25
ప్రవేశపరీక్ష: సెప్టెంబర్ 8 నుంచి
వెబ్‌సైట్: www.osmania.ac.in, www.cpget.tsche.ac.i, www.tscpget.com, www.ouadmissions.com
ఇది కూడా చదవండి: దేశ ప్రజలపై పెగాసస్ స్పైవేర్‌ను ఎందుకు వాడారు: రాహుల్ గాంధీ..