Friday, October 18, 2024

CPGET 2024 – ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుద‌ల …

హైదరాబాద్‌: తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని అనుబంధ కళాశాలల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఎడ్‌ తదితర కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జులై 6 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్షలకు 73,342 మంది దరఖాస్తు చేసుకోగా.. 64,765 మంది హాజరయ్యారు. ఇటీవల కీ విడుదల చేసిన అధికారులు.. శుక్రవారం ఫలితాలు ప్రకటించారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement