జిల్లాకేంద్ర పోలీసు బలగాలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కు కేటాయించ బడిన కేంద్ర పోలీసు బలగాల(CAPF) ఉన్నతాధికారులతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు మంగళవారం నాడు జిల్లాలోని కమీషనరేట్ కేంద్రంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశానిర్దేశం చేశారు. ఇందులో ముఖ్యంగా ప్రీ- పోలింగ్ మరియు పోలింగ్ డే, పోస్ట్ పోలింగ్ ఆక్టివిటీస్ గురించి వారికి తెలియజేశారు. కేంద్ర బలగాల సహాయంతో జిల్లాలో ఏరియా డామినేషన్ , ఫ్లాగ్ మార్చ్ మరియు సమస్యాత్మక పోలింగ్ య కేంద్రాలు వున్న ప్రాంతాలలో పాయింట్ పెట్రోలింగ్ నిర్వహిస్తామని , ఎస్.ఎస్.టి, ఎఫ్.ఎస్.టి లలో వీరిని నియమిస్తామని మరియు QRT లు గా విభజించి సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక ఫూట్ పెట్రోలింగ్ కోసం ప్రణాళిక సిద్దం చేశామని తెలిపారు.
, తద్వారా ప్రశాంత వాతావరణం లో జిల్లాలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తామన్నారు. జిల్లా ప్రజలు మరియు ఓటర్లు పోలీసులకు, కేంద్ర పోలీస్ బలగాలకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ పరిపాలన సి. రాజు , CAPF అసిస్టెంట్ కమాండెంట్ లు మురుగవేల్ , అనుజ్ కుమార్ ,సంజయ్ కుమార్ , ఏసిపి లు, జి.నరేందర్ , టి. కరుణాకర్ రావు , ACP (ఏఆర్ ) C. ప్రతాప్ , CCRB, ఎలెక్షన్ సెల్ ACP విజయ్ కుమార్, CAPF ఇన్స్పెక్టర్ లు విపిన్ సింగ్ , అభయ్ సింగ్ మరియు కమిషనరేట్ లోని పలువురు CI లు మరియు SI లు పాల్గొన్నారు.
ఎన్నికల విధులపట్ల నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ సస్పెన్షన్
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ గంగాధర పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న కానిస్టేబుల్ నెంబర్ . 2013, కే. శ్రీనివాస్ ఎన్నికల విధి నిర్వహణ లో బ్లూ కొల్ట్ పెట్రోలింగ్ విధుల్లో నియమింపబడ్డాడు, అధికారుల ఉత్తర్వులు పాటించకుండా, విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందున మరియు విధులకు గైర్హాజరు అయినందున విచారణ జరిపి ఈరోజు అనగా తేది: 24-10-2023 మంగళ వారం రోజు సస్పెండ్ చేసినట్లు కమిషనర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు
ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేశారు. కరీంనగర్ కమీషనరేట్లోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న అన్ని స్థాయిల అధికారులందరు క్రమశిక్షణతో చట్టానికి మరియు ఎన్నికల నియామవళికి లోబడి పనిచేయాలని, విధులపట్ల నిర్లక్ష్యం వహించినవారిపై శాఖపరమైన చర్యలతో పాటుగా ఎన్నికల నియమావళి అనుసారం కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు..