సరూర్ నగర్ లేక్ ఔట్ పోస్ట్‌లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి వస్తున్నారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. ఇక్కడ సూసైడ్ చేసుకోవడానికి యత్నించిన ఆరుగురిని కాపాడామన్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవాలనుకునే వారిని అలాంటి ఆలోచనల నుంచి బయటపడేయడానికి సైకాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. 040 48214800 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు 52 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలందరూ కలసి పోరాడితేనే కరోనాపై విజయం సాధించగలమని సీపీ మహేశ్ భగవత్ అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మే 12 నుంచి ఇప్పటివరకు 56,466 లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. లాక్డౌన్ రూల్స్‌ను అతిక్రమించిన వారిపై 41,990 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. 11,638 మందిపై మాస్క్ ధరించనందుకు కేసులు నమోదు చేశామన్నారు.
గ్యాదరింగ్ అయినందుకు గానూ 601, సోషల్ డిస్టన్స్ పాటించనందకు 1,823 మందిపై కేసులు పెట్టామన్నారు. మొత్తంగా 13,490 వాహనాల్ని సీజ్ చేసినట్లు వివరించారు. గూడ్స్ వాహనాలను రాత్రి 9 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు రోడ్ల మీదికి రావాలన్నారు. బాలాపూర్‌లో బైక్ గ్యాంగ్‌లో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. రిస్క్ టేకర్స్‌కు 30 చోట్ల వ్యాక్సినేషన్ చేస్తున్నామన్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 బెడ్లతో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని సీపీ భగవత్ పేర్కొన్నారు.