Tuesday, November 26, 2024

Booster Dose: ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ కు బూస్టర్ డోసులు.. తెలుగు రాష్ట్రాల్లో మొదలు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత 10 రోజులుగా రోజు వారీ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. అందులో భాగంగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లకు ఇవాళ్టి నుంచి బూస్టర్‌ డోస్‌లు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తెలుగురాష్ట్రాల్లోనూ బూస్టర్ డోసులు వేస్తున్నారు.

సెకండ్‌వేవ్‌ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన వైద్య, ఆరోగ్య, పారిశుధ్య, పోలీసు తదితర రంగాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా నిలిచిన వారికి బూస్టర్ డోసులు ఇస్తున్నారు. వీరితో పాటు మరికొన్ని రోజుల్లో 60 ఏళ్లు పైబడిన వారికి సైతం బూస్టర్‌ డోస్‌ వేయాలన్నారు. కొవిషీల్డ్‌, కోవ్యాక్సిన్‌ వేసుకున్న వారికి మరోమారు బూస్టర్‌డోసు వేయనున్నారు. వీలైనంత ఎక్కువ మందికి బూస్టర్‌డోసు వేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు.

హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని వైద్యశాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. పౌరులతో కలిసి చార్మినార్‌లోని ప్రభుత్వ యునాని హాస్పిటల్‌లో తాజా డ్రైవ్ ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement