Friday, November 22, 2024

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు కొవాగ్జిన్ సరఫరా -భారత్ బయోటెక్

హైదరాబాద్ – గుజరాత్​, అసోం, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు నేరుగా కరోనా టీకా కొవాగ్జిన్ డోసులను సరఫరా చేసినట్లు భారత్ బయోటెక్ శుక్రవారం ప్రకటించింది. పవిత్ర రంజాన్​ మాసంలోనూ ఇందుకోసం కృషి చేసిన తమ ఉద్యోగులందరికీ ట్విట్టర్​ ద్వారా అభినందనలు తెలిపారు భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, ఎండీ సుచిత్ర ఎల్లా. ఢిల్లీ ప్రభుత్వంతో సరఫరా సంబంధిత సమస్యల నేపథ్యంలో కొవాగ్జిన్​ లాట్లను కేరళ, ఉత్తరాఖండ్​కు పంపినట్లు కూడా పేర్కొన్నారు సుచిత్రా ఎల్లా. అయితే ఏ రాష్ట్రానికి ఎన్ని డోసులు సరఫరా చేసిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

పుణె ప్లాంట్​లో ఆగస్టు నాటికి ఉత్పత్తి.

.బయోవెట్ ప్రైవేట్​ లిమిటెడ్​కు పుణెలో ఉన్న ప్లాంట్​ను కొవాగ్జిన్ తయారీకి ఉపయోగించుకునేందుకు భారత్​ బయోటెక్​కు అప్పగించాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. పుణె డివిజినల్ కమిషనర్ సురభ్ రావ్, జిల్లా కలెక్టర్​ రాజేశ్ దేశ్​ముఖ్​లు ప్లాంట్​ను సందర్శించారు. ఈ ప్లాంట్​లో ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి పూర్తి స్థాయిలో కొవాగ్జిన్ ఉత్పత్తి జరిగేందుకు అవకాశముందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement