Sunday, November 24, 2024

TG | వాళ్ల బెయిల్ పిటిషన్ కొట్టివేత…

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన మాజీ పోలీసులు.. ప్రణీత్ రావు, భుజంగ రావు, రాధాకిషన్, తిరుపతన్న మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా.. వీళ్లు నలుగురు అరెస్టయి వంద రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఛార్జిషీట్ దాఖలు చేయలేదని ఈ నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో నిందితులు మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. మరోసారి పిటిషన్‌ను నాంపల్లి క్రిమినల్ కోర్టు కొట్టేసింది. అరెస్ట్ చేసి 100 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఛార్జిషీట్ దాఖలు చేయలేకపోయారంటూ నిందితుల తరుపు న్యాయవాదులు వాదించారు.

మరోవైపు.. ఛార్జిషీట్ వెనక్కి ఇచ్చినంత మాత్రాన వేయనట్టు కాదని పోలీసుల తరుపు న్యాయవాది వాదించారు. విచారణ కీలక దశలో ఉందని.. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుని పోలీసులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. నలుగురు నిందితులకు బెయిల్‌ను తిరస్కరిస్తున్నట్టు తీర్పు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement