Tuesday, November 26, 2024

ఎంపీ అరవింద్‌పై కేసు కొట్టివేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలను చించారన్న అభియోగంపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును ప్రజా ప్రతినిధుల కోర్టు సోమవారం కొట్టి వేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా కేబీర్‌ పార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు చింపి … సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్‌ఎస్‌ నేత తాతా మధు చేసిన ఫిర్యాదుతో 2020 నవంబర్‌లో కేసు నమోదు చేశారు.

దీనిపై ప్రజా ప్రతినిధుల కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ నెల 24 న కోర్టు కేసు విచారణకు అరవింద్‌ హాజరు కాకపోవడంతో న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ను జారీ చేసింది. సోమవారం అరవింద్‌ కోర్టుకు హాజరవడంతో ఎన్‌బీడబ్ల్యు రద్దు చేసి విచారణ చేపట్టడంతో పోలీసుల అభియోగాలన్నీ తప్పని అరవింద్‌ కోర్టుకు విన్నవించారు. అరవింద్‌, పోలీసుల తరఫున వాదనలను విన్న ప్రజా ప్రతినిధుల కోర్టు తగిన ఆధారాలు లేవంటూ కేసును కొట్టి వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement