Friday, November 22, 2024

భూ వివాదం- మనస్థాపంతో దంపతుల ఆత్మహత్యయత్నం…

జనగామ ఆగస్టు 13 ప్రభ న్యూస్ – వారసత్వంగా వచ్చిన భూమిపై కొందరు కావాలని భూ వివాదం సృష్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మనస్థాపానికి గురై సెల్ఫీ తీస్తూ పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సంఘటన నర్మెట మండలంలోని సూర్య తండ లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

వివరాలు ప్రకారం నర్మెట మండలం సూర్య తండలో భూక్య గురు భూక్య సునీత లకు తాతల ముత్తాతల నుండి వారసత్వంగా సంక్రమించిన సర్వే నెంబర్ 258 లో1.09 ఎకరాల భూమి ఉంది ప్రస్తుతం భూక్య సునీత పేరా రికార్డు ల‌లో ఉంది. అదే గ్రామానికి చెందిన భూక్య జయరాం భూక్య సురేందర్ భూక్య శ్రీను లు పై కొంతకాలంగా వివాదాలు సృష్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని దీంతో ఎస్సై రెవెన్యూ అధికారులతో సర్వే చేయించాలని సూచించడం జరిగింది. ఆ సర్వే పూర్తి అయ్యి రిపోర్టు రాకుండానే భూక్య జయరాం భూక్య సురేందర్ భూక్య శ్రీను లు ఇబ్బందులు పెడుతున్నారని మనస్థాపానికి గురై తెల్లవారుజామున దంపతులు సెల్ఫీ తీస్తూ పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.. ఆత్మ‌హ‌త్య‌య‌త్నాన్ని గమనించిన స్థానికులు దంపతులను చికిత్స నిమిత్తం జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement