Wednesday, November 20, 2024

Counters – బామ్మార్ధికి అమృత్ – అల్లుడికి కొడంగల్ – ఢిల్లీ మీడియాతో కేటీఆర్

న్యూ ఢిల్లీ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావ మరిది కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి RR ( రాహుల్ – రేవంత్) టాక్స్ వసూలు చేస్తున్నారని స్వయంగా చెప్పిన ప్రధాని మోడీ.. అక్రమ వసూళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు.

రేవంత్ తన బామ్మర్దికి అమృతం పంచారని,…శోధా కంపెనీకి అమృత్ ను కట్టబెట్టరాన్నారు.రేవంత్ రెడ్డికి బామ్మర్ది కావడమే సృజన్ రెడ్డి అర్హత అన్నారు.

కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ డబ్బులకు రాష్ట్రం టెండర్లు పిలిచిందని, అయితే ఆ వివరాలు ఎక్కడా లేవు అని నిప్పులు చెరిగారు.

అమృత్‌ స్కీం టెండర్లలో రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వేల కోట్ల రూపాయల టెండర్లు అక్రమంగా కట్టబెట్టారని ఆధారాలతో సహా బయటపెడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? నిలదీశారు.దీనిపై విచారణ జరపడం బీజేపీకి లిట్మస్ టెస్ట్ వంటిదన్నారు.

- Advertisement -

కేటీఆర్.అమృత్ 2 పథకంలో భాగంగా పెద్దయెత్తున అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. 8,888 కోట్ల పనులపై విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తన బావమరిదికి చెందిన కంపెనీకి పెద్దయెత్తున టెండర్లను అప్పగించారన్నారు. 11,307 పనులను అప్పగించారని కేటీఆర్ అన్నారు.

ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను…

ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను రేవంత్ రెడ్డి ఉల్లంఘించారని కేటీఆర్ ఆరోపించారు. అమృత్ పథకంలో భాగంగా జరిగిన అవినీతిపై విచారణ జరపాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని కేటీఆర్ తెలిపారు. అమత్ 2.0 పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అప్పగించిన పనులపై జరిగిన అవినీతిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అమృత్ టెండర్లలో అవినితి స్పష్టంగా కనిపిస్తుందన్న కేటీఆర్ సంక్షేమ పథకాలకు మాత్రం డబ్బులు లేవని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసులురెడ్డి తమ పదవులు వదులుకోవాల్సిందేనని కేటీఆర్ అన్నారు

బామ్మార్ధికి అమృత్ – అల్లుడికి కొడంగల్

ముఖ్యమంత్రి బామ్మర్దిని అధికారులు కాపాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి బామ్మర్దికి అమృతం పంచి.. కొడంగల్ వాసులకు ఫార్మా పేరుతో విషం పంచుతున్నారని ఫైర్‌ అయ్యారు. అల్లుడు కోసం కొడంగల్ ను బలి పెడుతున్నారన్నారు. ప్రజల తిరుగుబాటు మొదలయిందని బాంబ్‌ పేల్చారు కేటీఆర్‌. తెలంగాణ లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ సర్కార్ 300 కోట్ల రూపాయలతో యాడ్స్ ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ… తెలంగాణకు వచ్చి మహిళలను కలవాలని… వాస్తవాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. మహారాష్ట్రలో చేస్తున్న తెలంగాణ ప్రచారంలో అన్ని అబద్దాలే అని ఆగ్రహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement