Saturday, September 28, 2024

Counters – కాంగ్రెస్ లీడ‌ర్ల‌ స్ప్లిట్‌ పర్సనాలిటీ …. ఆ వ్యాధిగాని సోకిందా?

ఢిల్లీలో ఒక‌లా.. గ‌ల్లీలో మ‌రోలా
రాహుల్ వ్య‌తిరేకిస్తే.. రేవంత్ ఆహ్వానించారు
ఇప్పుడేమో నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లా?
ఇదేం ప‌ద్ధ‌తి.. ఇదేమి ద్వంద్వ నీతి
విమ‌ర్శ‌లతో అటాక్ చేసిన‌ కేటీఆర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే ద్వంద్వ నీతి కూడా ఆత్మహత్య చేసుకుంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. ఓ వైపు ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ సంస్థలు మోదీ జేబు సంస్థలంటూ ఆరోపణలు చేస్తుంటే.. మరోవైపు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అదానీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇవ్వాళ అదే రేవంత్ రెడ్డి సహా మంత్రులు అదానీ సంస్థకు వ్యతిరేకంగా ఆందోళన చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఏమైనా స్ల్పిట్ పర్సనాలిటీ వ్యాధితో బాధపడుతున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

అక్క‌డో తీరు.. ఇక్క‌డో తీరా?..

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని రెడ్ కార్పెట్ వేసి మరీ అదానీని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి.. నేడు నిరసన తెలపనుండటం ఈ ఏడాదిలోనే అతి పెద్ద జోక్ అని కేటీఆర్ అన్నారు. అదానీ సంస్థలకు ప్రోత్సహాకాలు ఇచ్చి ఇప్పుడు అదే అదానీ మోసగాడని ఆరోపిస్తున్నారంటే కాంగ్రెస్‌ను ఏమనాలని ప్రశ్నించారు. ఇలాంటి డ్రామాలతో దేశాన్ని మోసం చేయగలమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ. ఇదీ కాంగ్రెస్‌ నీతి. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పగలరా అంటూ నిలదీశారు.

హిండెన్ బ‌ర్గ్ ఆరోప‌ణ‌లు..

సెబీ చైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌-అదానీ సంస్థలు కుమ్మక్కైనట్లు హిండెన్ బర్గ్ అనే అమెరికా సంస్థ ఆరోపణలు చేసింది. దీని ఆధారంగా ఈ వ్యవహారంపై జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ(జేపీసీ)తో విచారణ చేయాల‌ని కాంగ్రెస్ గురువారం దేశ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. దీనిపై ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement