పోలీసులను, బిజెపి కార్యకర్తలను చంపితే అవార్డులు ఇస్తామా
రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదిస్తే అవార్డు ఇవ్వాలా
ఈ ఏడాది పద్మ అవార్దులు అర్హులకే ఇచ్చాం
కేంద్రం ఇప్పటికే తెలంగాణకు 12 లక్షల కోట్లు ఇచ్చాం
ఇక్కడ డబ్బులన్నీ ఢిల్లీ కప్పం కట్టడానికే పోతున్నాయి
కేంద్ర పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వ పేర్లు మార్చేస్తుంది
రేవంత్ సర్కార్ పై కేంద్ర మంత్రి బండి గరం గరం
హైదరాబాద్ – తెలంగాణలో పద్మ పురస్కారాలపై వివాదం నెలకొన్న వేళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం అవార్డులు ఇవ్వదని, అర్హులకే మాత్రమే ఇస్తుందని అన్నారు.
పద్మ అవార్డుల విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలపై ఆయన నేడు స్పందించారు. హైదరాబాద్ లోని బిజెపి సెంట్రల్ కార్యాలయం బండి మీడియాతో మాట్లాడుతూ, పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికి ఇస్తామని తేల్చి చెప్పారు.
ప్రజా గాయకుడిగా గద్దర్ ను గౌరవిస్తామని, అదే సమయంలో అయన భావజాలాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం?. మా కార్యకర్తలను చంపిన వ్యక్తులపై ఆయన పాటలు పాడారు. మరి అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తాం?. బరాబర్ ఇవ్వం”.. అని అన్నారాయన. పద్మ అవార్డుల జాబితాలో అర్హులకే అవార్డులు వచ్చాయని అంటూ,. రాష్ట్ర ప్రభుత్వం మంచి పేర్లు పంపితే కేంద్రం పరిశీలిస్తుందన్నారు.. అయితే. ఏ పేరు పడితే ఆ పేరు పంపితే ఇవ్వరు అని బండి సంజయ్ పేర్కొన్నారు.
మాకు భేషజాలు లేవు
తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుందని అంటూ ఇప్పటికే . తెలంగాణకు కేంద్రం గత పదకొండేళ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేశారు. కేంద్ర నిధులతో నడిచే పథకాలను తెలంగాణ ప్రభుత్వం పేర్లను మార్చేస్తున్నదని మండిపెడ్డారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపేది లేదన్నారు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకు పథకాలు అందేలా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని వెల్లడించారు..
కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల రాజకీయాల కారణంగా పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు బండి. బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని, అయితే తామే ఇస్తునట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నదని మండిపడ్డారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు.. కేవలం పేరు కోసమే పాకులాడుతోందని ఆరోపించారు. మండలానికి ఒక గ్రామానికి మాత్రమే పథకాలను అమలు చేయడం ఎంటి?. మండలంలో మిగతా గ్రామాల పరిస్థితి ఎంటి?.అని ప్రశ్నించారు.
పైసలన్నీఢిల్లీ కప్పం కట్టడానికే పోతున్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పైసలు లేవని, .. ఉన్న పైసలు ఢిల్లీ లో కప్పం కట్టడానికే సరిపోతోన్నదని అన్నారు బండి. తెలంగాణలో 14 శాతం కమీషన్ల ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయని తెల్చి చెప్పారు.. తమకు ఎటువంటి బేషజాలు లేవని అంటూ కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివృధ్ధి అని అన్నారు. , రాష్ట్ర ప్రభుత్వానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి నిధులు వస్తున్నాయా? అని ప్రశ్నించారు. పేరు కోసం పాకులాడి గతంలో కేసీఆర్ ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. . 2 లక్షల 40 వేల ఇళ్లను కేంద్రం తెలంగాణకు కేటాయిస్తే.. పేరు కోసం లబ్దిదారులకు ఇవ్వలేదన్నారు. . తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడింది ఎవరనేది ప్రజలకు తెలుసు అని బండి సంజయ్ అన్నారు.