హైదరాబాద్ : తమకు అసెంబ్లీలో మాట్లాడేందుకు స్పీకర్ తగిన అవకాశాలు ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల శిక్షణ తరగతులలో పాల్గొనేందుకు మర్రి చెన్నారెడ్డి మానవవనరులు కేంద్రానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను స్పీకర్ కావడానికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిందన్నారు. సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్ స్పీకర్‌పై ఈ రకమైన వాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోందని స్పీకర్ వ్యాఖ్యానించారు. శాసన సభలో ప్రతిపక్షానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడం లేదని కౌంటర్ ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement