Monday, November 18, 2024

Counter – దీపావ‌ళీ పార్టీలో సారా బుడ్లా…..కెటిఆర్ ను నిల‌దీసిన రేవంత్

హైద‌రాబాద్ – దీపావళి అంటే ఎవరైనా చిచ్చుబుడ్లు కాలుస్తారు. కానీ, జన్వాడ ఫామ్‌హౌస్‌లో మాత్రం సారాబుడ్లు బయటికొచ్చాయని అన్నారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి… . అనధికార విదేశీ మద్యంతో కేటీఆర్‌ దీపావళి జరుపుకొంటున్నారా? అని కెటిఆర్ ను ప్ర‌శ్నించారు.. హైద‌రాబాద్ లోని స‌చివాల‌యంలో ఆయ‌న నేడు మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ, జన్వాడ ఫామ్‌హౌస్‌పై బిఆర్ ఎస్ చేస్తున్న కట్టుకథలు హాస్యాస్పదమ‌న్నారు. . ప్రభుత్వం చేసే మంచి పనులకు మీడియా సహకరించాల‌ని కోరారు.

మూసీ పరివాహకంలో సమయం వచ్చినప్పుడు పాయాత్ర చేస్తానని చెప్పారు. అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్‌ వరకు పాదయాత్ర చేస్తాననిఅన్నారు. బిఆర్ఎస్ అక్రమ సొమ్ముతో సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తోంద‌న్నారు. ఎంతో ఆలోచించి హైడ్రాను రంగంలోకి దించామ‌ని, . హైడ్రాపై దేశమంతా తెలిసేలా బిఆర్ఎస్ ప్రచారం చేసింద‌న్నారు. . హైడ్రా వల్ల రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందనడం సరికాద‌ని అంటూ .. దేశ వ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో స్తబ్దత వచ్చింద‌ని చెప్పారు.

- Advertisement -

నాది రాజ‌మౌళి స్టైల్ ..

సినిమాల్లో రాజమౌళి, వర్మ.. ఇద్దరిది వేర్వేరు స్టయిల్‌. అయితే తాను మాత్రం రాజ‌మౌళి స్టైల్లోనే ముందుకు వెళ‌తాన‌ని చెప్పారు రేవంత్ రెడ్డి.. రాజకీయాల్లో త‌న‌ స్టైల్ నాద‌ని, .. కేటీఆర్‌ స్టైల్ కేటీఆర్‌ది అని అన్నారు. రాజకీయంగా కేసీఆర్‌ పనైపోయింద‌న్నారు. . రూ.7.50 లక్షల కోట్ల అప్పులు కేసీఆర్‌ మిగిల్చి వెళ్లార‌న్నారు. రుణమాఫీలో సాంకేతిక లోపాలు ఉన్నవి మాత్రమే ఆగాయ‌ని అన్నారు రేవంత్ . 10 నెలల్లో 50వేల ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ చెప్పుకొచ్చారు. టీజీపీఎస్సీ నియామకాల్లో 90శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే వ‌స్తున్నాయ‌ని చెప్పారు.. త‌న‌ది చిన్నవయస్సు అని రాజకీయంగా ఇంకా భవిష్యత్తు ఉంద‌ని వివ‌రించారు. అణచివేతతో ప్రజాగ్రహాన్ని మూటగట్టుకోలేన‌ని అంటూ . అందరి విషయంలోనూ ప్రజాస్వామ్యబద్దంగానే వ్యవహరిస్తాం” అని సీఎం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement