Friday, November 22, 2024

Counter – ప్రాజెక్ట్ లు అప్పగింతపై మీరు సంతకాలు చేసి నిందలు మాపై వేస్తారా… రేవంత్

కృష్ణా ప్రాజెక్టుల అంశంపై బీఆర్‌ఎస్‌ నేతల కేటీఆర్‌, హరీశ్‌రావు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన సచివాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్వహణ ఇతర అంశాలపై స్పష్టత ఇచ్చారు. ప్రజలను గందరగోళానికి గురిచేసి బీఆర్‌ఎస్‌ నేతలు లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ పాపాలను కాంగ్రెస్‌పై నెట్టే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. కేసీఆర్‌ ఎంపీగా ఉ‍న్నప్పుడే విభజన చట్టంలో ఈ అంశాలు పొందుపర్చారని గుర్తుచేశారు. కేసీఆర్‌ సూచన మేరకే అప్పట్లో ఈ చట్టాన్ని రూపొందించారని అన్నారు. ఇప్పుడు విభజన చట్టం వల్ల రాష్ట్రానికి ఏదైనా నష్టం జరిగితే దానికి కేసీఆరే బాధ్యులని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వంకు అప్పగించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 89 వరకు విధివిధానాలను ఖరారు చేసే రూల్స్ ఫ్రేమ్ చేశారని తెలిపారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే పక్రియకు పునాది రాయి వేసింది 2014లోనని అప్పుడు కేసీఆర్ ఎంపీగా మద్దతు ఇచ్చారని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement