Thursday, November 21, 2024

Counter – స‌ర్పంచ్ ప‌ద‌వికి కూడా కౌశిక్ రెడ్డి అన‌ర్హుడే – మంత్రి కోమ‌టిరెడ్డి

హైద‌రాబాద్ – ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క‌నీసం స‌ర్పంచ్ ప‌ద‌వికి కూడా అన‌ర్హుడంటూ విమ‌ర్శించారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. అత‌డు చేసిన చేసిన వ్యాఖ్యలకు సీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైద‌రాబాద్ లో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తాను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేని అని అరికెపూడి గాంధీ ఇప్ప‌టికే చెప్పార‌ని అంటూ సచ్చి పోయిన పార్టీని బ్రతికించడం కోసం నాటకాలు అడుతున్నారు అంటూ బిఆర్ఎస్ పార్టీపై మండిప‌డ్డారు..

అరికెపూడి వివాదంలో కౌశిక్ రెడ్డి త‌ల‌దూర్చడం ఏమిటంటూ ప్ర‌శ్నించారు.. ఆంధ్రప్రాంత ప్రజల్ని తిట్టడం బీఆర్‌ఎస్‌ విధానామా ‘ అని కెసిఆర్ ను నిల‌దీశారు.. ఎపి వాళ్లు లేకుటే బీఆర్‌ఎస్‌కు ఇన్ని సీట్లు వచ్చేవా? అని మంత్రి ప్ర‌శ్నించారు.. . హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బ తీయాలనేది వాళ్ల‌ ఉద్దేశమ‌ని,.కాంగ్రెస్ శ్రేణులు వారి వ‌ల‌లో ప‌డ‌కుండా సంయమనం పాటించాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement