హైదరాబాద్ – రూ.50 లక్షల నొట్ల కట్టలతో దొరికి చిప్పకుడు తిన్నవాడు వచ్చి నీతులు చెప్తున్నాడంటూ విమర్శించారు పరోక్షంగా రేవంత్ రెడ్డిని మంత్రి కెటిఆర్ విమర్శించారు. ఉప్పల్ స్కై వాక్ టవర్ ను ప్రారంబించిన అనంతరం ఆయన మాట్లాడుతూ,. రేవంత్ రెడ్డి నీ చూస్తే ఒక కథ గుర్తుకు వస్తుందని,.. అమ్మానాన్నని చంపి అనాథను వదిలేయండి అన్న కుర్రాడి కథను కేటీఆర్ చెప్పారు. అమరవీరులు చనిపోయింది ఈ కాంగ్రెస్ వల్లే కదా. మళ్లీ అమరవీరుల స్థూపం గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు..
నిన్న బిజెపి సభలో ఒక్కటి కూడా నడ్డా పనికి వచ్చేవి మాట్లాడలేదని,. సొల్లు మాటలు చెప్పి పోయారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను జైల్లో వేస్తామని అంటున్న బిజెపి వాళ్లు ఎందుకు వేస్తారో చెప్పాలి. అభివృద్ది చేసినందుకా..? అని ప్రశ్నించారు . నడ్డా కానీ ఇక్కడ ఉన్న తీన్ ఫుట్ గుర్తు పెట్టుకోవాలి అడ్డగోలుగా మాట్లాడితే ఉరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఐదేరెళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం 35 ఫ్లై ఓవర్ లను నిర్మించిందని తెలిపారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ ను కేంద్రం తీసుకుందని, నాలుగేళ్లు అయినా ఇంకా దాన్ని పూర్తి చేయడం లేదంటూ విమర్శించారు. జాతీయ రహదారి అని ఫోజులు కొట్టి.. నాలుగేళ్లుగా కట్టలేకపోతున్నారన్నారు. కేంద్రం కడుతున్న ఉప్పల్, అంబర్ పేట ఫ్లై ఓవర్లు ఎప్పటికి పూర్తి అవుతాయో ఎవరికీ తెలియదన్నారు..